వీడియో: సమంత పెళ్లిలో కేక పెట్టించిన వెంకీ, మన వెంకీ అసలు తగ్గలేదుగా, తొలిచూపులోనే సమ్మోహనానికి గురై ‘ఏ మాయ చేసావే’ అంటూ అతడు చేసిన ప్రేమ ప్రతిపాదనకు ఆమె మనోల్లా‘సమంతా’ ఇంతా కాదు! నువ్వూ నేను ఇక ‘మనం’ అంటూ ఆనందంగా ఓకే చెప్పేసింది! కట్‌చేస్తే.. ఇక నుంచి వారి వైవాహిక జీవితం నిత్య ‘చైతన్య’మే! మొత్తంగా ఆ ఇద్దరి మధ్య ఏడేళ్ల ప్రేమ.. ఏడడుగులు నడిపించింది. అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కొడుకు సినీ నటుడు నాగచైతన్య, నటి సమంత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నాగచైతన్య, సమంత వివాహం శుక్రవారం అందాల తీరం గోవాలో వైభవంగా జరిగింది. వెగాటర్ బీచ్‌లోని డబ్ల్యూ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం రాత్రి 11.52 నిమిషాలకు సమంత మెడలో నాగచైతన్య తాళి కట్టారు. అక్కినేని, రామానాయుడు కుటుంబసభ్యులు సహా సినీ రంగానికి చెందిన పలువురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. శనివారం సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్య ఇక్కడే క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో నాగచైతన్య-సమంత మరోసారి పెళ్లి ప్రమాణాలు చేయనున్నారు.
Video:-
http://flikster.com/content/venkatesh-and-akhil-dance
Comments
Post a Comment