కేక వీడియో: మళ్ళీ ధోని-చాహల్ వలలో పడ్డ మాక్స్ వెల్, ఈ సారి ట్రాప్ అదుర్స్

కేక వీడియో: మళ్ళీ ధోని-చాహల్ వలలో పడ్డ మాక్స్ వెల్, ఈ సారి ట్రాప్ అదుర్స్  


ట్వంటీ 20ల్లో మ్యాక్స్ వెల్ ను అవుట్ చేయడానికి ధోని-చాహల్ వ్యూహం ఏమిటనేది ఆసక్తికరం. టీ 20ల్లో మ్యాక్స్ వెల్ చాలా ప్రమాదకర బ్యాట్స్ మన్ . దాంతో తొలి టీ 20 లో అతని చోటు ఖాయంగానే కనబడుతోంది. మరొకవైపు చాహల్ పై కెప్టెన్ కోహ్లికి నమ్మకం ఎక్కువ కనుక అతనికి తుది జట్టులో దాదాపు ఓకే. ఈ క్రమంలో ధోనితో కలిసి చాహల్ ఏ ప్రణాళిక రచిస్తాడో చూడాలి. వన్డేల్లో కొనసాగించిన ఆఫ్ స్టంప్ బంతుల వ్యూహాన్నే కొనసాగిస్తాడా?లేక అప్పటి ఆట తీరును బట్టి ప్రణాళిక రచిస్తారో చూడాలి. ఎందుకంటే ప్రస్తుత ఆసీస్ జట్టులో డేవిడ్ వార్నర్ తరువాత మ్యాక్స్ వెల్ అత్యంత కీలకమైన ఆటగాడు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగే మ్యాక్స్ వెల్ ను కట్టడి చేసేందుకు తగిన వ్యూహం లేకపోతే ఒంటి చేత్తో మ్యాచ్ ను తనవైపుకు తిప్పుకోవడం ఖాయం. దాంతో మ్యాక్స్ వెల్ ను తొందరగా పెవిలియన్ కు పంపడానికి చాహల్-ధోనిల వ్యూహం ఏమిటనేది ఈరోజు రాత్రి మ్యాచ్ లో చూడాల్సిందే.

Comments