ఈరోజు రంజీ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ ని 'ప్లీజ్ ప్లీజ్' అడిగిన బౌలర్ | వెళ్లకుండా అంతే ఉన్న గంభీర్ ( కోపం తో ఆగిపోయిన బౌలర్ )

ఈరోజు రంజీ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ ని 'ప్లీజ్ ప్లీజ్' అడిగిన బౌలర్ | వెళ్లకుండా అంతే ఉన్న గంభీర్ ( కోపం తో ఆగిపోయిన బౌలర్ ) 
ఢిల్లీ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. యువ పేసర్లు నవదీప్‌ సైనీ, కుల్వంత్‌ కేజ్రోలియా నిప్పులు చెరగడంతో.. సెమీస్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్‌-26 పరుగుల తేడాతో బెంగాల్‌ను చిత్తు చేసింది. ముఖ్యంగా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సైనీ (4/35) దెబ్బకు కకావికలైన బెంగాల్‌ రెండో ఇన్నింగ్స్‌లో 24.4 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. సైనీకి కుల్వంత్‌ కేజ్రోలియా (4/40) మంచి సహకారం అందించాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 271/3తో ఆట కొనసాగించిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 398 పరుగులకు ఆలౌటైంది. షమి (6/122) ఆరు వికెట్లు తీశాడు. బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 286 రన్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

పోరాడుతున్న విదర్భ: గణేష్‌ సతీష్‌ (71 బ్యాటింగ్‌) అజేయ అర్ధ శతకంతోపాటు అపూర్వ వాంఖడే (49) రాణించడంతో రంజీ సెమీస్‌లో కర్ణాటకతో మ్యాచ్‌లో విదర్భ పోరాడుతోంది. మూడో రోజైన మంగళవారం రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన విదర్భ ఆట చివరకు 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేసింది. కరుణ్‌ నాయర్‌ (153) టాప్‌ స్కోరర్‌.

Comments